TPT: ఏర్పేడు మండలం ముసలిపేడు నల్ల గంగమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడ్డారు. అమ్మవారికి అలంకరించిన నగలను అపహరించి పరారయ్యారు. ఆలయానికి వచ్చిన పూజారులు, గ్రామస్థులు నగలు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.