ASR: జీకేవీధి మండలం రింతాడ రైతు సేవా కేంద్రంలో మంగళవారం రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేసినట్లు ఏవో దాసరి గిరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉప సంచాలకులు వైవీ రమణారావు పాల్లొని రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. భూసారం పెరిగేందుకు పచ్చిరొట్ట విత్తనాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఏడీఏ తిరుమలరావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.