ATP: జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కూల్ కార్మికుల నాలుగు నెలల వేతనాలను విడుదల చేయాలని, స్మార్ట్ కిచెన్లను రద్దు చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ఏడికి వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ నగర అధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.