NRML: కడెం మండలంలోని దోస్తునగర్ గ్రామ సమీపంలో గల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జన్నారం వైపు నుంచి కడెం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఖానాపూర్ మండలంలోని మేడమ్పల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి.