BHPL: గోరికొత్తపల్లి (M)లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక టోకెన్లు ఇవ్వకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని BSF ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజేందర్ ఆరోపించారు. ఇతర మండలాల్లో టోకెన్లు అందజేస్తున్నప్పటికీ గోరికొత్తపల్లిలో మాత్రం టోకెన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. అధికారులు స్పందించి టోకెన్లు పంపిణీ చేసి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు.