TG: సచివాలయంలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. పంటవ్యర్థాలు కాల్చడం వల్ల జరిగే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పించారు. పంటవ్యర్థాల దహనంతో అనేక రకాల వ్యాధులు వస్తాయన్నారు. గాలి కాలుష్యం పెరిగి ప్రజారోగ్యం దెబ్బతినడమే కాకుండా, మంటలు వేగంగా వ్యాపించి ఎద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.