మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్లో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వృక్షాలు నేలకొరిగాయి. ఈ సందర్భంలో కాలనీవాసులు ఈ విషయాన్ని కార్పొరేటర్ మంజుల శ్రీశైలం దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్ మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. నేడు ఉదయం విరిగిపోయిన చెట్లను కొట్టు వేసి ఆ ప్రాంతం అంతా శుభ్రపరిచారు.