AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో చర్చిస్తారు.