NTR: విజయవాడ మాచవరంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసినదే. మృతి చెందిన వ్యక్తి రూబేనుగా పోలీసులు గుర్తించారు. మరొక వ్యక్తి షేక్ నజీరుద్దీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. వాహనం నడిపిన కిషోర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. కాగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టారు.