AP: తూ.గో. జిల్లాలో Dy. CM పవన్ కళ్యాణ్ పర్యటించారు. గోదావరిలో కాలుష్య ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకటనగరం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు కలిసేచోటకు వెళ్లారు. పరిశ్రమ నుంచి వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించారు. నివారణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.