నారాయణపేట పట్టణంలో డెంగీ జ్వరంతో ఓ యువతి మృతి చెందడం విషాదాన్ని నింపింది. పట్టణానికి చెందిన భావన కాంబ్లే (20) డెంగీ జ్వరంతో సోమవారం మృతి చెందింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు మొదట ప్రైవేట్ ఆసుపత్రిలో, అనంతరం జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా ప్లేట్లెట్స్ తగ్గి మరణించింది.