SRD: న్యాల్కల్ మండలంలో రైతులకు జనుము విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ అధికారి అభినాష్ వర్మ తెలిపారు. ఈ నెల 26 నుంచి న్యాల్కల్ DCMS రైతు సేవా కేంద్రం, హద్నూర్ సహకార సంఘం కేంద్రంలో విత్తనాల పంపిణీ ప్రారంభం కానుంది. 40Kgల జనుము విత్తన బస్తా ధర రూ.3110గా నిర్ణయించగా, మొత్తం 250 బస్తాలు పంపిణీకి ఉన్నాయని తెలిపారు.