అన్నమయ్య: పీటీఎం మండలంలో సోమవారం, బొంతవారిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమార్తె స్వాతి (12) మిద్దెపై పూలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడింది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి బాలికను 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.