ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మహేశ్వర్ రెడ్డి అనే యువకుడి మృతి కేసులో బెదిరింపులకు పాల్పడిన రెడ్డి ఆడియో, వీడియోలు ముంబై ల్యాబ్లో లభ్యం కావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రాజశేఖర్ రెడ్డితో పాటు జైపాల్ రెడ్డిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.