W.G: మాధవాయపాలెంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్థులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం పీజీఆర్ఎస్లో వినతి పత్రం అందజేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చర్యలను విరమించుకోవాలని అధికారులను కోరారు. పరిస్థితుల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.