NTR: సోమవారం ఎండ తీవ్రత భయాందోళన కలిగించింది. తీవ్రమైన ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందిన ఘటనలు వెలుగు చూశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు, వన్‌టౌన్‌లో ఇద్దరు, కృష్ణలంకలో ఒకరు, మాచవరంలో ఇద్దరు, వాంబే కాలనీ ప్రాంతంలో ఒకరు మృతి చెందినట్లు గుర్తించారు.