BPT: విభిన్న ప్రతిభావంతులు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఇకపై ప్రతి నెల నాలుగో బుధవారం ప్రత్యేక పిటిషన్ల కార్యక్రమం (PGRS) నిర్వహిస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గతంలో ఇది నాలుగో శుక్రవారం జరిగేదని, అయితే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ‘వన్ మంత్ ఫోర్ విజిట్స్’ కార్యక్రమంలో భాగంగా ఈ మార్పు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.