ELR: ప్రస్తుత సాగు సీజన్లో ఎరువుల పంపిణీపై పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ప్రతినిధులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.