GNTR: నుదురుపాడు సమీపంలో సోమవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. భారీ వర్షం, గాలులకు రోడ్డుపై పడిన చెట్లను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది.