చిత్తూరులో ఓ ట్రావెల్స్ అధినేత ఇంట్లో భారీ చోరీ జరిగింది. వన్ టౌన్ ఇంఛార్జ్ CI నెట్టికంఠయ్య వివరాల మేరకు.. నాయుడు బిల్డింగ్స్ సమీపంలోని కిరణ్ కుటుంబం నివాసం ఉంది. 2రోజుల క్రితం కిరణ్ కుటుంబ సభ్యులతో HYDకు వెళ్లారు. ఇంట్లో ఎవరు లేరని గుర్తించిన దొంగలు తాళాన్ని పగలగొట్టి బీరువాలో ఉన్న 200 గ్రాముల బంగారం, 3.50 కేజీల వెండి చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.