SDPT: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్ దరఖాస్తులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈనెల 31 వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. E-PASS పోర్టల్ ద్వారా అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు సమర్పించుకోవాలని సూచించింది. గత గడువు ముగిసే సమయానికి సాంకేతిక ఇబ్బందుల కారణంగా చాలామంది విద్యార్థులు దరఖాస్తు చేయలేకపోయారని అధికారులు తెలిపారు.