NLG: పెద్దవూర ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన అంగన్వాడీ టీచర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జే.గోపాల్రావు మహిళల భద్రతపై మాట్లాడారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధ చట్టంపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని సూచించారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయడం చట్ట విరుద్ధమన్నారు.