PLD: వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబ సభ్యులు మంగళవారం తాడేపల్లిలో వైఎస్ జగన్ను కలిశారు. రషీద్ తల్లిని, కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్.. పార్టీ ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉండటంతో పాటు, నిందితులకు కఠిన శిక్ష పడేలా పూర్తి స్థాయిలో న్యాయ సహాయం అందిస్తామని ఆయన మాట ఇచ్చారు.