BHPL: కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా మంగళవారం పలు జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు రాహుల్ శర్మ, బొర్కడే హేమంత్ సహదేవరావు, కుమార్ దీపక్, సత్య ప్రసాద్ అధికారులు పాల్గొన్నారు.