CTR: పెనుమూరు మండలం ఉగ్రాణం పల్లి పంచాయతీ వీరభద్ర కాలనీలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి నూతనంగా నిర్మించిన రేకుల ఇంటి పైకప్పు కూలిపోయింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన జనసేన నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. కూటమి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందిస్తామని జనసేన జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ యుగంధర్ పొన్న తెలిపారు.