HYD: ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరుతో నకిలీ డిగ్రీ పట్టాలు తయారుచేస్తున్న ముఠాను సరూర్నగర్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మహేశ్వరి అలియాస్ రేష్మ అనే మహిళను అదుపులోకి తీసుకుని, ఆమె ఇంటి నుంచి నకిలీ డిగ్రీ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పట్టాలు 2009 నుంచే వాడుకలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.