KRNL: ఆస్తి వివాదంలో మహిళను హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హొళగుంద మం. సులువాయికి చెందిన గాదిలింగప్ప తన 4.50 ఎకరాల భూమిని ఇద్దరు భార్యలకు పంచాలనుకున్నాడు. దీనికి అంగీకరించని మొదటి భార్య మల్లమ్మ, ఆమె కుమారులు శేకన్న, చిన్న గాదిలింగ.. రెండో భార్య ఎల్లమ్మను కొడవలితో నరికి చంపారు.