PDPL: రామగుండం కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లను కమిషనర్ అరుణ శ్రీ అంగీకరించినట్లు JAC నాయకులు తెలిపారు. మంగళవారం నాయకులు, కార్మికులు ఆమెను కలిసినట్లు పేర్కొన్నారు. ఇటీవల మరణించిన పారిశుద్ధ్య కార్మికురాలు మల్లమ్మ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, పని వేళలు మార్పు చేస్తామని అంగీకరించినట్లు పూర్కొన్నారు.