MLG: జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత తెలిపారు. జిల్లాలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, బాల్య వివాహ నిరోధక చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని ఆమె కోరారు.