KRNL: కర్నూలు కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఏ.సిరి పాల్గొన్నారు. విజయవాడ నుంచి సీఎస్ సాయి ప్రసాద్, SEC వివేక్ యాదవ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై సమీక్ష నిర్వహించారు. ఓటర్ జాబితా తయారీలో అవకతవకలకు తావివ్వరాదని SEC వివేక్ ఆదేశించారు. సమావేశంలో ఈఆర్వోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.