AP EAPCET ఫలితాలను జూన్ 10 తర్వాత రిలీజ్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈసారి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకూ బెటర్‌మెంట్‌కు అవకాశం ఇవ్వగా, ఆ పరీక్షలు జూన్ 5న ముగియనున్నాయి. EAPCETలో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉండటంతో పరీక్షలు పూర్తయ్యే వరకు ఆగాల్సి ఉంది. వచ్చే అకడమిక్ ఇయర్‌కు EAPCETలో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించాలని విద్యాశాఖ యోచిస్తున్నట్లు సమాచారం.