NLG: నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వినాయక హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూరగాయల దుకాణం ఎదురుగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా బైకుల ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.