KMM: రాబోయే విద్యా సంవత్సరానికి గురుకులాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని Dy. CM భట్టి విక్రమార్క సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ఇవాళ జిల్లా కలెక్టర్ దివాకర TS, CP సునీల్ దత్, సంబంధిత అధికారులతో గురుకుల, సంక్షేమ వసతి విద్యాసంస్థలపై ఆయన సమీక్షించారు. వేసవి కాలంలోనే అవసరమైన మరమ్మతులు, మౌళిక వసతుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.