MBNR: జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు వన్‌టౌన్ SI అప్పయ్య కోయిలకొండ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను సందర్శించి తనిఖీలు చేశారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని గోవుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సిబ్బందిని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి పశువులను తరలించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.