KRNL: బక్రీద్ పండుగ నేపథ్యంలో కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఉల్చాల రోడ్డు Y-జంక్షన్ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమానాస్పద వాహనాలను పరిశీలించారు. అక్రమ మూగజీవాల రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.