సింగపూర్ ఓపెన్ టోర్నీలో పి.వి. సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పుత్రి కుసుమ వర్థిని (ఇండోనేసియా)తో జరిగిన తొలి రౌండ్లో సింధు 21–17, 21–18 తేడాతో గెలుపొందింది. ఇక పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ – చిరాగ్ శెట్టి జోడీ తొలి రౌండ్లో చెన్ జి యి – ప్రెస్లీ స్మిత్ (మలేసియా) జంటపై 26–28, 21–15, 21–13 తేడాతో గెలిచింది.