ADB: ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో పీఎం జన్మన్, ధర్తీ ఆబా జాతీయ గిరిజన ఉత్కర్ష్ అభియాన్ పథకాల పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ ప్రయోజనాలు నేరుగా అందేలా చూడాలని కోరారు.