NZB: డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ 2026–27 రెండో విడతలో భాగంగా ఎన్సీసీ, స్పోర్ట్స్ ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎన్సీసీ 6, స్పోర్ట్స్ 3, వికలాంగులు 1 కలిపి మొత్తం 10 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారని దోస్త్ సమన్వయకర్త డా. వాసం చంద్రశేఖర్ తెలిపారు.