మహబూబ్‌నగర్ జిల్లాలో ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, క్రీడల శాఖ మంత్రి వాకాటి శ్రీహరి పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ఉదండాపూర్ రిజర్వాయర్ బాధితులతో సమావేశం నిర్వహిస్తారు. 10:30 గంటలకు గంగాపూర్ పత్తి మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు.