విశాఖలో పూలకుండీలు, చెప్పుల స్టాండ్లు, స్విచ్ బోర్డుల వద్ద దాచిన తాళం చెవులను గుర్తించి వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని విశాఖ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పి.కె.పాలవలస గ్రామానికి చెందిన నిందితుడిగా గుర్తించారు.