PDPL: ఓదెల మండలంలోని శానగొండ పరిధి గొల్లపల్లి గ్రామంలో సోమవారం విషాదం నెలకొంది. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా వీచిన గాలివాన బీభత్సానికి ఒజ్జ సదయ్యకు చెందిన రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ ప్రమాదంలో షెడ్డు కింద ఉన్న గొర్రెల కాపరి మంగళి లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.