నారాయణపేట జిల్లాలో బాల్య వివాహాలను నిర్మూలించి, సంపూర్ణ ఆరోగ్య జిల్లాగా మార్చేందుకు మనమంతా కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం నారాయణపేట ఓ ఫంక్షన్ హాలులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా వారోత్సవాల్లో పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో తయారు చేసిన పోషకాహారం పదార్థాలను పరిశీలించారు.