ASF: పెంచికల్ పేట్ మండలం దర్గపల్లికి చెందిన పలువురు BRS నాయకులు, వార్డు సభ్యులు MLC విఠల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మండలంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై MLC ఆధ్వర్యంలో పనిచేయడానికి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.