MDK: తెలియని వ్యక్తులకు నగదు పంపవద్దని ఎస్పీ డీ.వీ.శ్రీనివాసరావు హెచ్చరించారు. ఫంక్షన్ హాల్, క్యాటరింగ్, ఫోటోగ్రఫీ వ్యాపారులే లక్ష్యంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. మొదట బుకింగ్స్ పేరుతో మాట్లాడి, ఆపై అత్యవసరమంటూ డబ్బులు అడిగి మోసం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.