CTR: మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రేపు పుంగనూరులో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం సోమవారం తెలిపింది. రేపు ఉదయం 9:30 నిమిషాలకు నల్లగుట్లపల్లి తండాకు చేరుకొనున్నారు. తర్వాత ఏటవాకిలిలో ప్రసన్న పార్వతి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు చెప్పారు.