NLR: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారులు సంతృప్తి చెందేలా అధికారులు చొరవ చూపాలని MLA ప్రశాంతి రెడ్డి సూచించారు. సోమవారం కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నిబంధనల ప్రకారం గడువులోగా ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.