SRD: సంగారెడ్డి మండలం నాగపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం ప్రతినిధులు పరిశీలించారు. కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయని రైతులు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా హమాలీలు, లారీల కొరత కారణంగా ధాన్యం నిల్వలు పెరుగుతున్నాయని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్ కోరారు.