KRNL: పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించాలని ఇవాళ కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల హక్కులను హరించే చర్యలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. మతం మారినా కుల వివక్ష కొనసాగుతూనే ఉందని, దళిత పాస్టర్లపై వేధింపులు ఆపాలని కోరారు. అనంతరం మండల తహసీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు.