W.G: ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నట్టు ఉండి సబ్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జునరావు సోమవారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.14,000, 52 పేక ముక్కలను స్వాధీన పరుచుకున్నామని పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసామన్నారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగిన సహించేది లేదని హెచ్చరించారు.