ప్రకాశం: కనిగిరికి చెందిన న్యాయవాది, కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్‌కు హైదరాబాద్‌లో జరిగిన “బి ది చేంజ్” అవార్డు కార్యక్రమంలో “వ్యాన్‌గార్డ్” సేవా పురస్కారం లభించింది. సమాజ సేవ, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, కరోనా సమయంలో చేసిన సేవలను గుర్తించి తెలంగాణ హైకోర్టు జడ్జి రాధారాణి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.